భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కొవిడ్ విలయతాండవానికి దేశ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,637 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 551 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,553కు చేరగా, ఇందులో యాక్టివ్ కేసులు 2,92,258. ఈ వైరస్ నుంచి 5,34,621 మంది కోలుకున్నారు. కాగా ఇప్పటి వరకు కరోనాతో 22,674 మంది చనిపోయారు.
దేశంలోనే మహారాష్ర్టలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ర్టలో 2,46,600 పాజిటివ్ కేసులు(మరణాలు 10,116), తమిళనాడులో 1,34,226(మరణాలు 1,898), ఢిల్లీలో 1,10,921 పాజిటివ్ కేసులు(మరణాలు 3,334) నమోదు అయ్యాయి.