ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఐశ్యర్యరాయ్‌, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌‌గా అధికారులు గుర్తించారు. ఇప్పటికే బిగ్‌బీ అమితాబచ్చన్‌, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ కూడా వైరస్‌ బారినపడగా శనివారం రాత్రి నానావతి దవాఖానలో ఐసోలేషన్‌ యూనిట్‌లో చేరారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ముంబై బీఎంసీ మేయర్‌ కిశోర్‌ పడ్నేకర్‌ ఆదివారం తెలిపారు. జయాబచ్చన్‌, ఐశ్యర్యరాయ్‌, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా నెగెటివ్‌గా వచ్చిందని తెలిపిన కొద్ది సమయానికే రెండో విడత పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆయన ట్వీట్ చేస్తూ.. ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆమె కూతురు ఆరాధ్య అభిషేక్ బచ్చన్ కూడా కొవిడ్-19 పాజిటివ్‌గా గుర్తించారని, జయా బచ్చన్ నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. త్వరగా కోలుకోవాలని బచ్చన్ కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఇప్పటికే అమితాబ్‌, ఆయన తనయుడు అభిషేక్‌ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో వారు నివసించే ప్రాంతాన్ని అధికారులు కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. భవనానికి బీఎంసీ అధికారులు సీల్ వేశారు. బిల్డింగ్ బ‌య‌ట కంటైన్‌మెంట్ జోన్ అని నోటీస్‌ అతికించారు. అనంత‌రం ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు.