తెలంగాణలో కొత్తగా మరో 1,269 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 1,269 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 800 ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్‌ మల్కాజిగిరి 94, సంగారెడ్డి 36, కరీంనగర్‌, నాగర్‌కర్నూల్‌ 23, మహబూబ్‌నగర్‌ 17, నల్లగొండ, వనపర్తి 15, మెదక్‌ 14, వరంగల్‌ అర్బన్‌ 12, నిజామాబాద్‌ 11, పెద్దపల్లి 9, మహబూబాబాద్‌ 8, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, జోగుళాంబ గద్వాల 7, వికారాబాద్‌, జనగామ 6, ఆదిలాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల 4, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట 3, వరంగల్‌ రూరల్‌ 2, ఖమ్మం 1 చొప్పున రికార్డయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1,70,324 పరీక్షలుచేయగా, 34,671 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 8 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటివరకు మొత్తం 356 మంది మరణించారు. కొవి డ్‌ చికిత్స అందించే ప్రభు త్వ దవాఖానల్లో 10శాతం పడకలే భర్తీ అయ్యాయని, 90శాతం ఖాళీగా ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.