పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత, నాటిన ప్రతి మొక్కను కాపాడవలసిన బాధ్యత అందరి పై ఉంది అని తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, ఆచార్య తుమ్మల పాపి రెడ్డి అన్నారు, నేడు (13 జూలై) కాకతీయ విశ్వవిద్యాలయం నందు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమారు గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కులు నాటారు.
మొక్కలు నాటే ప్రక్రియ నిరంతరంగా జరగాలని, విశ్వవిద్యాలయ అధికారులు తమ గ్రీన్ ఛాలెంజ్ ను కాకతీయ విశ్వవిద్యాలయ పరిధి లోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ లో ఉన్న అనుబంధ కళాశాల లుకు చేయాలనీ, ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా అనుబంధ కళాశాలలు వారి వారి కళాశాల ఆవరణలో జూలై 24 వ తేదిన మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు జన్మదినంను పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టవలసిందిగా, ప్రతి సంవత్సరం జూలై 24వ తేదిన మొక్కలు నాటే విధంగా చర్యలు చేపట్టాలని, గత కొన్ని సంవత్సరాలు గా రాష్ట్ర ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హరిత హారం ద్వార పచ్చదనం పెరిగింది అని, రాష్ట్రంలో గ్రీన్ బెల్ట్ కుడా పెరిగింది అని, ప్రతి కళాశాల, ప్రతి అధికారి దీనిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమం లో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే. పురుషోత్తం, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్వపు వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. సీతారామారావు పరిక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. మహేందర్ రెడ్డి, విశ్వవిద్యాలయ అబివృద్ధి అధికారి ఆచార్య వి. రామచంద్రం, దూరవిద్యా కేంద్ర సంచాలకులు ఆచార్య జి. వీరన్న, ఆచార్య దినేష్ కుమార్, ఆచార్య బి. వెంకటరం రెడ్డి, డాక్టర్ వై వెంకయ్య, డాక్టర్ పి. సదానందం, డాక్టర్ ఎస్ జ్యోతి, డాక్టర్ ఆర్. మల్లికార్జున రెడ్డి, డాక్టర్ కే. మోహన్ రెడ్డి, యూనివర్సిటీ ఇంజనీర్ జి. భవాని ప్రసాద్ ఇతర బోధనా, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.