ఏపీలో ప్రవేశ పరీక్షలు వాయిదా

ఏపీలో కరోనా విజృంభిస్తుండడంతో విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేసింది. సెప్టెంబర్‌ మూడో వారానికి ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోమవారం నిర్ణయం తీసుకున్నారని విద్యుత్‌శాఖ మంత్రి ఆదిమలుపు సురేశ్‌ తెలిపారు. మొత్తం 8 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పదో తరగతి పరీక్షలను ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్‌ అసెన్‌మెంట్‌ మార్కుల ఆధారం విద్యార్థులందరినీ పాస్‌ చేసింది.