ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకూ భారీగా పెరుగుతున్నాయి. అక్కడ మరణాలు కూడా అదేస్థాయిలో చోటుచేసుకుంటుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 43 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 408కి చేరింది. తాజాగా 1,916 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 33,019కి చేరింది. ఇందులో 15,144 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా..17,467 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
