పరవాడ సంఘటన దురదృష్టకరం : ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్

విశాఖ జిల్లా పరవాడ రాంకీ ఫార్మాసిటీలో  అగ్నిప్రమాదం సంఘటన జరగడం దురదృష్టకరమని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఫార్మా, రసాయనాల పరిశ్రమల్లో నిర్వాహకులు భద్రత ప్రమాణాలు పాటించాలని ఆయన ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో 7 స్టార్‌ హోటళ్లను నిర్మించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఆయన ప్రకటించారు.ఈ నెలాఖరులోగా పర్యాటక శాఖ హోటళ్లలో మరమ్మత్తులు పూర్తి చేస్తామని అన్నారు. ప్రస్తుతం పర్యాటక శాఖ నెలకు రూ.10కోట్లు వస్తుందని  మంత్రి  వెల్లడించారు.  

ఈ సంఘటపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరతి విచారం వ్యక్తం చేశారు. సంఘటనకు గల కారణాలను ఆమె అధికారులను అడిగా తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు.