తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ తగ్గడంలేదు. తాజాగా మం గళవారం 1,524 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 815 కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 240, మేడ్చల్ మల్కాజిగిరి 97, సంగారెడ్డి 61, నల్లగొండ 38, వరంగల్ అర్బన్ 30, కరీంనగర్ 29, మెదక్ 24, వికారాబాద్ 21, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి 19, నిజామాబాద్ 17, సూర్యాపేట 15, జోగుళాంబగద్వాల 13, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి 12, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం 8, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ 7, ములుగు 6, వనపర్తి, కుమ్రంభీం ఆసిఫాబాద్ 5, సిద్దిపేట, జనగామ 4, నిర్మల్ 3, వరంగల్ రూరల్, జగిత్యాల 2, నాగర్‌కర్నూల్ 1 చొప్పున కేసులు నమోదయ్యా యి. కరోనాకు ఇతర ఆరోగ్య సమస్యలు తోడవడంతో ఒక్కరోజే 10 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 375కు చేరింది. రాష్ట్రంలో 1,95,024 పరీక్షలుచేయగా, 37,745 పాజిటివ్‌గా తేలాయి. కొవిడ్ చికిత్స అందించే ప్రభుత్వ దవాఖానల్లో మొత్తం 17,081 పడకలు ఉండగా, 1,805 మాత్రమే భర్తీ అయ్యాయని, 15,276 పడకలు ఖాళీగా ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.