ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 44 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 452కు చేరుకుంది.
అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 9మంది చొప్పున, కర్నూలులో 5గురు, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాలో 4గురు చొప్పున, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాలో ఇద్దరేసి చొప్పున నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో జిల్లాలో ఒక్కొక్కరూ కరోనాతో చనిపోయారు. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 2524 కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఏపీలో 34451 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 16,621 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా 18,378 మంది డిశ్చార్జి అయ్యారు.