అసోం వరదలు.. కాజీరంగ నేషనల్‌ పార్కులో 66 జంతువులు మృతి

అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 59 మంది మృతిచెందగా 33 లక్షలకుపైగా జనం దీనికి ప్రభావితులయ్యారు. అయితే వరదల కారణంగా గోలాఘట్‌ సమీపంలోని కాజీరంగ నేషనల్ పార్కు 80శాతం నీటిలో మునిగిపోయింది. ఇప్పటివరకు 66 జంతువులు చనిపోయాయి. సుమారు 170 జంతువులను రక్షించినట్లు కాజీరంగ నేషనల్ పార్క్ డైరెక్టర్ పి శివకుమార్ చెప్పారు.