తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను రాష్ట్రప్రభుత్వం బదిలీచేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న శాంతికుమారిని బదిలీ చేసింది. ఢిల్లీలో తెలంగాణ భవన్ ఓఎస్డీగా ఉన్న ముర్తుజారిజ్వీకి ఆ బాధ్యతలు అప్పగించింది. శాంతికుమారిని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సాగునీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎన్విరాన్మెంట్ సైన్స్అండ్ టెక్నాలజీ బాధ్యతలను అదనంగా చూడనున్నారు. కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గాఉన్న యోగితారాణాను బదిలీచేసి ఆ స్థానంలో వాకాటి కరుణకు బాధ్యతలు అప్పగించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరికి అదనంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు.
