ఏపీలో కొత్తగా మరో 2,593 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి తగ్గడం లేదు. రోజు రోజుకు వేలల్లో కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 2,593 కరోనా కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. వైరస్‌తో ఇవాళ మరో 40 మంది మృతి చెందినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 38,044 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 18,159 యాక్టివ్‌ కేసులుండగా, 19,393 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 493 మంది వైరస్‌ ప్రభావంతో చనిపోయారు. గడిచిన 24గంటల్లో 22,304 మందికి వైద్యులు కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,40,267 టెస్టులు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.