తెలంగాణ రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ (టీడబ్ల్యూఆర్డీసీ) చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ పదవీకాలాన్ని ప్రభుత్వం ఏడాదికాలం పొడిగించింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. 2017 మార్చి ఒకటిన ప్రకాశ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది మార్చి ఒకటో తేదీతో ఆయన మూడేండ్ల పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రకాశ్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో సంవత్సరం పెంచింది.