నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కాంచనపల్లి నారాయణరావు(87) కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతకు గురైన ఆయ న బుధవారం రాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నారాయణరావుతోపాటు ఆయన తల్లిదండ్రులు, సోదరుడు సైతం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముఖ్య భూమిక పోషించారు. ఆ సమయంలో రజాకార్లు నారాయణరావుతోపాటు ఆయన తండ్రి రామచందర్‌రావును సైతం తిప్పర్తి మసీదులో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. నిజాం పాలన విముక్తి అనంతరం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. నారాయణరావు అంత్యక్రియలను గురువారం ఆయన కుమారుడు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది కాంచనపల్లి రాజేంద్రప్రసాద్ నిర్వహించారు.
