ఏపీలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 2602 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 2592 మంది ఏపీకి చెందిన వారు కాగా మిగతా 8 మంది ఇతర రాష్ర్టాలకు చెందినవారు. తాజాగా 24 గంటల్లో 42 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40,646కి చేరింది. ఇందులో 19,814 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 20,298 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 534 మంది మృతిచెందారు.
