కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి : మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని నల్లగొండ పట్టణంలో విజయవంతం చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో హరితహారం కార్యక్రమంలో తమకు కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలన్నారు. వార్డుల వారీగా ఖాళీ ప్రదేశాలు గుర్తించి మొక్కలు నాటాలన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పట్టణంలో కాలుష్యాన్ని తగ్గించాలని కోరారు. హరితహారం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో కమిషనర్‌ బచ్చలకూరి శరత్‌చంద్ర, వివిధశాఖల అధికారులు వెంకటేశ్వర్లు, యోగేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, సుర్గి శంకర్‌, ముర్తుజా, ఇబ్రహీం ఉన్నారు.