రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మ పాపిరెడ్డి పదవీకాలం పొడిగింపు

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి‌, వైస్‌ చైర్మన్లు, సభ్యుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెల తొలివారంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, వైస్‌చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, ప్రొఫెసర్‌ వీ వెంకటరమణతోపాటు కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు పదవీకాలం ముగియనున్నది. ఈ నేపథ్యంలో వారిని అలాగే కొనసాగిస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ శుక్రవారం జీవో జారీచేశారు.