దేశంలో ఒకేరోజు 34,884 కేసులు

దేశంలో కరోనా వైరస్‌ స్వైర విహారం చేస్తున్నది. వైరస్‌ విజృంభణతో ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు లేని ప్రాంతం లేదనట్లు పరిస్థితి తయారయ్యింది. గత నాలుగు రోజులుగా ప్రతి రోజు 32 వేలకు పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజుకూడా 34 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 34,884 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 10,38,716కు చేరింది. ఇందులో 3,58,692 యాక్టివ్‌ కేసులు ఉండగా, కరోనా బారినపడిన మరో 6,53,751 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా వైరస్‌ వల్ల కొత్తగా 671 మంది మరణించడంతో, మొత్తం కరోనా మృతులు 26,273కు పెరిగారు.