ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కరోజే రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 3,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 23,872 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,963 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారు. 1,411 మంది వ్యాధి నుంచి సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19తో తాజా 52 మంది మృతిచెందారు.
ఏపీలో జిల్లాల వారీగా వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరిలో 12 మంది, గుంటూరు- 8, కృష్ణా- 8, అనంతపూర్- 7, పశ్చిమ గోదావరి- 5, ప్రకాశం- 4, నెల్లూరు- 3, విశాఖపట్నం- 2, చిత్తూరు- 1, కడప- 1, విజయనగరంలో ఒకరు మరణించారు. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44,609 గా ఉండగా వీటిలో 22,260 యాక్టీవ్ కేసులు.