తెలంగాణ రాష్ట్రంలో కేసులు తీవ్రత కొనసాగుతూనే ఉంది. శనివారం 14883 మందికి టెస్టులు చేయగా, 1284 మందికి వైరస్ తేలింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 667 ఉండగా, రంగారెడ్డి 68, మేడ్చల్ 62, సంగారెడ్డి 86, ఖమ్మం 10, వరంగల్ అర్బన్ 37, వరంగల్ రూరల్ 5, నిర్మల్ 1, కరీంనగర్ 58, జగిత్యాల 1,యాదాద్రి 10, పెద్దపల్లి 14, మెదక్ 15, మహబూబ్‌నగర్ 16,మంచిర్యాల 19, జయశంకర్ 4, నల్గొండ 46, రాజన్న సిరిసిల్లా 2, ఆదిలాబాద్ 8, ఆసిఫాబాద్ 2, వికారాబాద్ 35, నాగర్ కర్నూల్ 1, జనగాం 6, నిజామాబాద్ 26, వనపర్తి 24, సిద్ధిపేట్ 22, సూర్యాపేట్ 23, గద్వాలో 14 మందికి వైరస్ నిర్ధారణ అయిందని అధికారులు ప్రకటించారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో ఆరుగురు చనిపోయినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 43,780 కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 30607కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 12765మంది చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 409కి పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు.
