తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన మహాకవి దాశరథి కృష్ణమాచార్య-2020 సాహితీ పురస్కారానికి ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్య ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిఏటా దాశరథి పేరిట సాహితీ పురస్కారాన్ని అందజేస్తున్నది. ఈ పురస్కారానికి అర్హులను ఎంపికచేసేందుకు ఈ
నెల 18న తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కమిటీ సమావేశమైంది. తిరునగరి రామానుజయ్య పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపింది. కమిటీ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించినట్టు యూత్ అడ్వాన్స్‌మెంట్ కల్చర్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. అవార్డుగ్రహీతకు పురస్కారంతోపాటు రూ.1,01,116 నగదు, షీల్డు, శాలువాను బహూకరిస్తారని పేర్కొన్నారు.