మొక్కలు పెంచడం సామాజిక బాధ్యత అనే సందేశంతో ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాచాలెంజ్ మహోద్యమంలా సాగుతోంది. ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడో విడతలో సినీ ప్రముఖులంతా ఉత్సాహంగా భాగమవుతున్నారు. తాజాగా డైరెక్టర్ అజయ్ భూపతి విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన ప్రశాంత్ వర్మ తన ఆఫీసులో మొక్కలు నాటారు.
మణికొండలోని తన ఆఫీసులో మొక్కలు నాటిన ప్రశాంత్ వర్మ ఇంత మంచి కార్యక్రమంలో తనని భాగం చేసిందుకు అజయ్ భూపతికి, సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఛాలెంజ్‌ని కొనసాగించాలని హీరోలు నాని,రవితేజ,రాజశేర్‌లని కోరారు. కాగా, అ!, కల్కి’ చిత్రాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా కొత్త జానర్‌తో చిత్రం చేస్తున్నారు. కరోనా వైరస్‌కి మందు కనిపెట్టే కథతో చిత్రం రూపొందనున్నట్టు తెలుస్తుంది. చిత్రానికి ‘కరోనా వ్యాక్సిన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఇటీవల ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.
