శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి

తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు (75) సోమవారం మృతి చెందా రు. పదిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనను తిరుపతిలోని స్విమ్స్‌ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా శ్రీనివాసమూర్తి దీక్షితులు 20 ఏండ్లపాటు కొనసాగారు. 2018 వరకు ఆయన ప్రధాన అర్చకుల హోదా శ్రీవారికి కైంకర్యాలు నిర్వహించారు. శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి పట్ల టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు.