గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్ల సిఫారసు

గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, వైఎస్సార్‌ జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానమ్‌ పేర్లను ఖరారు చేయగా.. అవే పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సమర్పించింది. పండుల రవీంద్రబాబు ఎస్సీ వర్గానికి చెందిన వారు కాగా, జకియా ఖానమ్‌ ముస్లిం మైనారిటీ మహిళా నేత కావడం విశేషం.