ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 62 మంది కరోనాతో మృత్యువాత పడ్డారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటిన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 4,994 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 58,668కు చేరుకుంది.ఒక్కరోజే రికార్డు సంఖ్యలో 62మంది చనిపోవడం కలవరపాటుకు గురిచేస్తుంది. తూర్పు గోదావరిలో 10 మంది,విశాఖపట్నంలో 9 మంది, , చిత్తూరు 8 మంది , శ్రీకాకుళంలో 7 చనిపోయారు.
అనంతపురం, పశ్చిమగోదావరిలో 6గురు చొప్పున , గుంటూరు, ప్రకాశంలో 5గురు చొప్పున,కర్నూలులో 4, కడప విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున కరోనాకు బలయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 758మంది కరోనాతో చనిపోయారని వైద్యులు తెలిపారు.