తెలంగాణ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,430 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,705 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 16,855 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా తెలిపింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న 2,062 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 36,385గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10, 891 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేడు కరోనాతో మరో ఏడుగురు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 429కి చేరింది. తాజాగా నమోదైన కరోనా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 703 ఉన్నాయి.
