ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6,045 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 64,713కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుద చేసింది. గడిచిన 24 గంటల్లో 49,553 శాంపిల్స్ పరీక్షించగా 6,045 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు పేర్కొంది. కొత్తగా కరోనాతో కోలుకున్న 6,494 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 32,127కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,763 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా కరోనాతో 65 మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 823గా నమోదైంది. మరోవైపు ఏపీలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 14,35,827 శాంపిల్స్‌ను పరీక్షించారు.
