ఐజీఎస్టీ కమిటీలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

  • జాతీయ స్థాయి వివాదాల పరిష్కార వేదికలో ఆర్థిక మంత్రికి చోటు 

జీఎస్టీ వివాదాలకు సంబంధించి కేంద్రం ఏర్పాటుచేసిన ఐజీఎస్టీ కమిటీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు చోటు దక్కింది. ఏడు రాష్ర్టాలకు చెందిన ఆర్థికమంత్రులతో కమిటీని ఏర్పాటుచేస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. హరీశ్‌రావుతోపాటు ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పంజాబ్‌, తమిళనాడు ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు.