పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్స్‌, లా అండ్‌ జస్టిస్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం పార్లమెంట్‌ సెక్రటేరియట్‌ ఓ ప్రకటన విడుదలచేసింది. ఇప్పటికే పరిశ్రమలశాఖ స్టాం డింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న కే కేశవరావు అదే పదవిలో కొనసాగనున్నారు. ఇటీవలే ఆయన స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా మరోసారి నియమితులైన విషయం తెలిసిందే. ఏపీనుంచి ఎన్నికైన అయోధ్య రామిరెడ్డి అర్బన్‌ డెవలప్‌మెంట్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పరిశ్రమలు, మోపిదేవి వెంకటరమణ బొగ్గు, ఉక్కు, పరిమళ్‌ నేత్వానీ ఐటీ స్టాండింగ్‌ కమిటీల్లో సభ్యులుగా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులందరినీ వివిధ స్టాండింగ్‌ కమిటీల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.