దేశంలో ఒక్క రోజులో 49,310 పాజిటివ్‌ కేసులు

దేశంలో మహమ్మారి కరోనా వైరస్‌ రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 49,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 740 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 12,87,945కు చేరుకోగా.. మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 30,601 చేరుకుంది. ఇక గడచిన 24 గంటలలో రికార్డ్ స్థాయిలో దేశ వ్యాప్తంగా 3,52,801 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు మొత్తంగా 1,54,28,170 కరోనా టెస్టులు చేశారు. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 4,40,135గా ఉండగా.. 8,17,208 మంది చికిత్స పొంది డిశ్చార్జ్‌ కావడం కాస్త ఊరటనిచ్చే అంశంగా పరిణమించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.