స్వీయ నిర్బంధంలోకి నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత

నిజామాబాద్‌ మాజీ ఎంపీ, ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆమె వద్ద పనిచేసే డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో వైద్యుల సూచనల మేరకు ఆమె హోం  ఐసోలేషన్‌లోకి వెళ్లారు. మందస్తు జాగ్రత్తలో భాగంగానే ఆమె క్వారెంటైన్‌ పాటిస్తున్నట్లు కవిత సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా తెలంగాణలో ఇప్పటికే పలువురు  ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. మరోవైపు  రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 50 వేలు దాటింది.