టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా ప్రియమైన సోదరుడు తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు.
సోషల్ మీడియా వేదికగా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్‌ఎస్ నేతలు, కార్యర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో #GiftAsmile అనే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.