తెలంగాణలో కొత్తగా మరో 1,640 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా మరో 1,640 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 52,466కి చేరింది. ఇందులో 11,677 యాక్టివ్‌ కేసులు ఉండగా 40,334 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. శుక్రవారం మరో 8 మంది మృతిచెందగా మొత్తం మరణాల సంఖ్య 455కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 15,445 పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు 3,37,771 శాంపిల్స్‌ పరీక్షించారు. ప్రతి పది లక్షల జనాభాకు సగటున 8,444 పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 683 కేసులు నమోదవగా రంగారెడ్డిలో 135, సంగారెడ్డిలో 102, కరీంనగర్‌లో 100, పెద్దపల్లిలో 98, కామారెడ్డిలో 56, నాగర్‌ కర్నూల్‌లో 52, మహబుబాబాద్‌లో 44, నల్లగొండలో 42, వరంగల్‌ అర్బన్‌లో 36, మేడ్చల్‌లో 30, భూపాలపల్లిలో 24, వరంగల్‌ రూరల్, మెదక్‌లో 22 చొప్పున, సిరిసిల్లలో 20, నిజామాబాద్, వనపర్తిలో 18 చొప్పున, జగిత్యాలలో 17, ములుగులో 14, ఖమ్మంలో 13,  సూర్యాపేట, యాదాద్రి, భద్రాద్రి, మహబూబ్‌నగర్‌లలో 11 చొప్పున, జనగామలో 10, ఆదిలాబాద్‌లో 9, వికారాబాద్, సిద్దిపేటలలో 8 చొప్పున, గద్వాల, మంచి ర్యాలలో 7 చొప్పున, నిర్మల్‌లో ఒక కేసు ఉన్నాయి.