ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 90వేలకు చేరువైంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 7,813 కరోనా కేసులు నమోదు కాగా, 52 మంది చనిపోయారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88,671కు పెరిగింది. ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 985కు చేరింది. ప్రస్తుతం 44,431 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 43,255 డిశ్చార్జ్ అయ్యారు.
