జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. మేయర్ కుటుంబసభ్యులకు మాత్రం కొవిడ్-19 నెగెటివ్‌గా వచ్చింది. మేయర్ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.
ఇటీవల మేయర్ సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో కొన్ని రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. గతంలో ఆయన కారు డ్రైవర్, టీ తాగిన హోటల్ యజమానికి కరోనా సోకడంతో మేయర్ రామ్మోహన్ రెండు సార్లు కొవిడ్-19 టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.