సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహార కార్యక్రమాన్ని తన గ్రీన్ చాలెంజ్ లతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లతున్న ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవిత తన జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ లోని తన నివాసంలో మొక్కలు నాటి రెడ్యానాయక్, కాంతరావు, పెద్ది సుదర్శన్ రెడ్డి లకు మొక్కలు నాటాలని గ్రీన్ చాలెంజ్ ని విసిరింది. ఎంపీ కవిత మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ఏంతో పట్టుదలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నడని దానికి మనమందరం సహకారం అందించాలన్నారు. తన జన్మదినం రోజున పేదలకు దుప్పట్లు, బడి పిల్లలకు నోట్ బూక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, జెడ్పిటిసి లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.