దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. గత వారం రోజులుగా 46 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రపంచంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దేశాల్లో భారత్ టాప్‌లో నిలిచింది. నిన్న 47,703 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా 48 వేలకుపైగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 15 లక్షలు దాటాయి.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48,513 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,31,669కి చేరాయి. ఇందులో 5,09,447 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 9,88,029 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 768 మంది మరణించడంతో కరోనా మృతులు 34,193కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
యాక్టివ్ కేసులకంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో రికవరీ రేటు 65కు చేరింది. అత్యధిక కేసులున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.