గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇండియన్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ సిక్కీ రెడ్డి మాధాపూర్ లోని తన నివాసంలో మూడు మొక్కలను నాటారు. ఇలాంటి బృహత్తర కార్యాన్ని చేపట్టి తనను పర్యావరణ పరిరక్షణ లో భాగస్వామిని చేసిన రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి తనను నామినేట్ చేసిన కోచ్ పుల్లెల గోపిచంద్ కి కృతజ్ఞతలు తెలిపారు.
అదే విధంగా , బ్యాడ్మింటన్ లో కామన్ వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ ప్రణవ్ జెర్రీ చోప్రా , బ్యాడ్మింటన్ ప్లేయర్ అశ్విని పొన్నప్ప, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత చెస్ గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లిలకు మొక్కలు నాటమని ఛాలెంజ్ విసిరారు,
