ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభన కొనసాగుతుంది. ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో 10,093 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 70,584 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 10,093 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కోవిడ్-19తో తాజాగా 65 మంది మరణించారు. వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని 2,784 మంది డిశ్చార్జ్ అయ్యారు.
జిల్లాల వారీగా కోవిడ్-19 మృతుల వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరిలో 14 మంది, అనంతపురం-8, విజయనగరం-7, చిత్తూరు-6, కర్నూలు-5, నెల్లూరు-5, కృష్ణ-4, ప్రకాశం-4, గుంటూరు-3, కడప-3, శ్రీకాకుళం-2, విశాఖపట్నం-2, పశ్చిమగోదావరిలో ఇద్దరు చొప్పున మరణించారు.
మొత్తంమీద కరోనా పాజిటివ్ కేసులు ఏపీలో లక్షా 20 వేల 390కి చేరుకున్నాయి. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,771. కోవిడ్-19 కారణంగా ఏపీలో ఇప్పటివరకు మొత్తం 1,213 మంది మృత్యువాతపడ్డారు. 55,406 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.