హరితహారంలో భాగంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను హైదర్‌నగర్ కార్పొరేటర్ రుద్రరాజు జానకి రామరాజు స్వీకరించి మొక్కలు నాటారు. రుద్రరాజు జానకి రామరాజు తన పుట్టినరోజు సందర్భంగా సతీసమేతంగా బుధవారం మొక్కలు నాటారు. వారు మొక్కలు స్వయంగా నాటడమే కాకుండా మొక్కలు పంచి ఇతర డివిజన్ కార్పొరేటర్లతో సైతం నాటించారు. అదేవిధంగా పర్యావరణహితమైన 2 వేల జూట్ బ్యాగ్‌లను స్థానికులు పంచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంన్నార్ సంస్థల యజమాని, హెచ్‌ఈఎస్ సంస్థల డైరెక్టర్ ధర్మరాజు, హీరో కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

