ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 1వ తేదీ నుంచి పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని ఏపీ పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,20,385 పెన్షన్లను అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల 61 లక్షల 28వేల పెన్షన్లను ఆగస్టు 1 నుంచి గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు.
ఇందుకోసం ప్రభుత్వం 1478.90 కోట్లను విడుదల చేసిందని వివరించారు. 1568 హెల్త్ పెన్షన్లను అందజేస్తున్నామని వెల్లడించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న పెన్షన్లను పెంచుతూ వాటిని కూడా వలంటీర్ల ద్వారా అందజేస్తామని వివరించారు. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్ బదులు జియో ట్యాగింగ్, పోటోల ద్వారా అందజేస్తామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.