గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మూవీ డైరెక్టర్ దేవా కట్టా

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో సంతోషంగా ఉందని మూవీ డైరెక్టర్ దేవా కట్టా అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం ఒక్కడితో మొదలై నేడు వేల మొక్కలు నాటేలా రూపుదిద్దుకుందన్నారు. సినీ హీరో అల్లరి నరేష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ.. మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ మూడు మొక్కలు నాటారు. 

అనంతరం మరో ముగ్గురు ( హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ నివేదా, సింగర్ స్మిత తల్లి జోగులాంబ )లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. వారు కూడా మూడు మొక్కలు నాటి  మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసరాలని డైరెక్టర్ దేవా కట్టా అన్నారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.