MP భానోత్ కవిత పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి, గ్రీన్ ఛాలెంజ్ చెయ్యడంతో అందులో భాగంగా ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈ రోజు భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఐదు మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ చేశారు. ZPTC మణు గారు, DCCB డైరెక్టర్ తుళ్లూరు బ్రహమ్మయ్యకు గ్రీన్ చాలెంజ్ విసిరారు. వీరు కూడా మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ చేయాలని అన్నారు. పినపాక నియోజకవర్గం లోని టిఆర్ఎస్ యువజన నాయకులను రోజు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి మిగతా యువకులకు చాలెంజ్ విసిరి ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సిఎo కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం ఎంతో విజయవంతమైందని ప్రతి పల్లెలో ప్రతి వాడలో పచ్చదనం వస్తుందని గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇంకా పచ్చదనం చిగురిస్తోందని ఆయన అన్నారు. గ్రీన్ ఛాలెంజ్ విసిరిన సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.