గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప‌్రముఖ యాంకర్ రవి మొక్కలు నాటారు. దేత్తడి హారిక, ఆర్టిస్ట్ శ్యామల విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన రవి నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పచ్చని ప్రకృతి పెంపుదలకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.
ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మొక్కలు నాటడం మన అందరి బాధ్యత అన్నారు. అనంతరం మరో నలుగురు పటాస్ షో డైరెక్టర్ సంతోష్ , యాంకర్ వర్షిని, యాంకర్ వింధ్యా, సతీమణి నిత్యా లకు గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు.