గ్రీన్ ఛాలెంజ్ చారిత్రాత్మకం – మంత్రి జగదీష్ రెడ్డి,
మంత్రుల నివాస ప్రాంగణంలో మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి, పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలా సాగాలి, నేలంతా పచ్చగా ఉండాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం, సమజాహితం కోసమే గ్రీన్ ఛాలెంజ్ – మంత్రి జగదీష్ రెడ్డి
పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ట్రాన్స్ కో &జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు, టి యస్ యస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి రెడ్డిలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన మంత్రి జగదీష్ రెడ్డి. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చారిత్రాత్మకమైనదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. ఇప్పుడిప్పుడే ఇది యావత్ భారతదేశానికి పాకుతుందని ఆయన చెప్పారు.గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం సమజాహితం కోసమే అన్నది ప్రతి ఒక్కరు గుర్తించాలని ఆయన కోరారు.రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఇప్పుడు ఒక ఉద్యమంలా ముందుకు సాగడం అభినందనీయమని ఆయన కొనియాడారు.
గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో బాగంగా చేవెళ్ల లోక్సభ సభ్యులు రంజిత్ రెడ్డి శాసనమండలి సభ్యులు కర్నె ప్రభాకర్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యలు విసిరిన ఛాలెంజ్ ను మంత్రి జగదీష్ రెడ్డి స్వీకరించారు.
అందుకు స్పందించిన ఆయన గురువారం ఉదయం బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో నీ ఆయన నివాస గృహంలో మూడు మొక్కలను నాటారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నేలంతా పచ్చగా ఉండాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు .అప్పుడే భవిష్యత్ తరాలను మనం కాపాడబడిన వారమౌతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మొదలైన హరితహారం ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని ఆలోచనలో పడేసిందన్నారు.పర్యావరణ పరిరక్షణ ఒక ఉద్యమంలా సాగాలని ఆయన కోరారు.పుదుచ్చేరి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లతో పాటు ట్రాన్స్కో & జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు ,టి యస్ యస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి లకు ఆయన తిరిగి గ్రీన్ చాలెంజ్ విసిరారు.ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రెవరిస్ కార్పోరేషన్ చేయిర్మెన్ దేవిప్రసాద్ దేవరకొండ శాసనసభ్యులు డి.రవీంద్ర నాయక్ ,రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యులు ఒంటెద్దు నరసింహా రెడ్డి టి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోమా భరత్ కుమార్ లతో పాటు గ్రీన్ ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ ప్రతినిధి కిషోర్ గౌడ్ టి ఆర్ యస్ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.