మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టిన మాజీ ఎంపీ కవిత

రక్షాబంధన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు ఆయన సోదరి, నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. ప్రగతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ, కేటీఆర్‌ సతీమణి శైలిమ ఉన్నారు. అలాగే టీఆర్‌ఎస్‌ మహిళా టీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రి సత్యవతి రాథోడ్, లోక్‌సభ సభ్యురాలు మాలోతు కవిత, ఎమ్మెల్యే సునీత, జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, టీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు గుండు సుధారాణి మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టారు.