మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా.. వారంతా పూర్తిగా కోలుకున్నారు. తాజాగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఎమ్మెల్యే కరోనా చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే పీఏతో పాటు గన్మెన్లు, ఇటీవల ఆయనను కలిసి వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన తల్లి, తమ్ముడు, పీఏ, గన్మెన్లకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మహిపాల్ రెడ్డి నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 983 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది మరణించారు. తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 67,660కు చేరాయి. ఇందులో 48,609 మంది కోలుకోగా, 18,500 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 11,911 మంది బాధితులు ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. cదీంతో రాష్ట్రంలో వైరస్ వల్ల ఇప్పటివరకు 551 మంది మృతిచెందారు.