రాజ్యసభ స్టాండింగ్ కమిటీల్లో ఇద్దరు టీఆర్‌ఎస్ సభ్యులు నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ దేశ్ దీపక్ వర్మ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పేపర్స్ లెయిడ్ ఆన్ ది టెబుల్ కమిటీ సభ్యుడిగా బండ ప్రకాశ్, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యుడిగా కేఆర్ సురేశ్ రెడ్డి నియమితులయ్యారు.