అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన క‌మెడీయ‌న్ పృథ్వీరాజ్

క‌మెడీయ‌న్ పృథ్వీరాజ్ అనే పేరుతో  క‌న్నా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అనే పేరుతో జ‌నాల‌కి ద‌గ్గరైన న‌టుడు పృథ్వీరాజ్. అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న సెల్ఫీ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు పేర్కొన్నారు. మీ అందరి ఆశీర్వాదం, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం త‌న‌కి కావాల‌ని కోరారు 

గ‌త ప‌ది రోజులుగా జ‌లుబుతో తీవ్రంగా బాధ‌ప‌డుతున్నారు పృథ్వీరాజ్. క‌రోనా టెస్ట్‌లు రెండు సార్లు చేయించినప్ప‌టికీ నెగెటివ్ వ‌చ్చింద‌ని అన్నారు. అయితే  టెస్టుల్లో   నెగెటివ్ అని వచ్చినప్పటికీ ఓ 15 రోజులు క్వారంటైన్‌లో ఉండాల‌ని డాక్ట‌ర్స్ చెప్ప‌డంతో నిన్న అర్ధ‌రాత్రి ఆసుప‌త్రిలో చేరిన‌ట్టు వీడియో ద్వారా తెలియ‌జేశారు పృథ్వీరాజ్. న‌టుడిగా బిజీగానే ఉంటూ ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్య‌త‌ల‌ని నిర్వ‌ర్తించిన పృథ్వీ ఆ మ‌ధ్య ఉద్యోగినితో రాస‌లీల‌లు ఆడుతున్నాడ‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొని ప‌ద‌వికి రాజీనామా చేశారు. అంద‌రిని న‌వ్వించే ఈ క‌మెడీయ‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.