ఏపీలో 9,747 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,747 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 64,147 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 9,747 కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కోవిడ్‌-19 కారణంగా తాజాగా 67 మంది మరణించారు. 6,953 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 21,75,070 శాంపిల్స్‌ను పరీక్షంచగా వీటిలో 1,76,333 కరోనా పాజిటివ్‌ కేసులుగా తేలాయి. కరోనా నుంచి ఇప్పటివరకు 95,625 మంది బాధితులు కోలుకుని డిశ్చార్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 79,104 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా మృత్యువాతపడ్డవారి వివరాలి ఉన్నాయి. గుంటూరులో 12 మంది, కృష్ణ-9, కర్నూల్‌-8, చిత్తూరు-7, తూర్పుగోదావరి-7, నెల్లూరు-7, అనంతపూరం- 6, శ్రీకాకుళం- 6, విశాఖపట్నం- 2, ప్రకాశం- 1, విజయనగరం-1, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు.